Aamir Khan: మత మార్పిడి ఆరోపణలపై సమాధానం

Aamir Khan

Aamir Khan

బాలీవుడ్ నటుడు (Aamir Khan) అమీర్ ఖాన్ మూడో వివాహం చుట్టూ నెలకొన్న వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆయన తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న తర్వాత మత మార్పిడి ఆరోపణలు, లవ్ జిహాద్ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ తనపై వస్తున్న విమర్శలకు స్పష్టత ఇచ్చారు. రీనా దత్తా, కిరణ్ రావుతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే గౌరీని వివాహం చేసుకున్నానని తెలిపారు.

గౌరీ హిందూ మతానికి చెందినవారు కాదని, ఆమె క్రిస్టియన్ కుటుంబానికి చెందినవారని అమీర్ ఖాన్ వెల్లడించారు. అయితే ఆమె ప్రస్తుతం క్రిస్టియన్ మత ఆచారాలను అనుసరించడం లేదని కూడా చెప్పారు. తన వివాహాల్లో ఎవరినీ బలవంతంగా మతం మార్చలేదని, భారతీయ చట్టాల ప్రకారమే పెళ్లిళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం లౌకిక విలువలను పాటిస్తుందని, మతం ఆధారంగా నిర్ణయాలు తీసుకునే కుటుంబం కాదని చెప్పారు.

(Aamir Khan)అమీర్ ఖాన్ తన కుటుంబంలోని ఇతర వివాహాలను ఉదాహరణగా పేర్కొన్నారు. తన ఇద్దరు సోదరీమణులు హిందువులను పెళ్లి చేసుకున్నారని, తన కుమార్తె కూడా హిందూ వ్యక్తినే వివాహం చేసుకుందని తెలిపారు. అలాగే తన అల్లుడు క్రిస్టియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడని వెల్లడించారు. దీంతో తన కుటుంబంలో మతాంతర వివాహాలు సాధారణ విషయమేనని చెప్పే ప్రయత్నం చేశారు.

ఇదిలా ఉండగా, ముస్లిం మతపెద్ద మౌలానా ఇబ్రహీం హుస్పేన్ షరియా చట్టాల ప్రకారం ముస్లింమేతర మహిళను వివాహం చేసుకోవడం అనుమతించబడదని వ్యాఖ్యానించారు. మరోవైపు హిందూ మత నాయకుడు స్వామి పరమహంస అమీర్ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మరింత ముదిర్చారు.

సినీ కెరీర్ పరంగా చూస్తే, అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా, ఆయన నిర్మించిన లాపతా లేడీస్ మరియు సితారే జమీన్ పర్ మంచి విజయాలు సాధించాయి. ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ చిత్రంలో కనిపించిన అమీర్ ఖాన్ ప్రస్తుతం 3 ఇడియట్స్ మరియు బట్వారా 1947 చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం.

Als0 read: