టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రిలో మోకాలి చికిత్స కోసం చేరారు. ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ఆయనకు వైద్యుల సూచన మేరకు మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలకృష్ణ కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

‘NBK111‘ (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్ సమయంలో ఈ గాయం జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కాకినాడ పోర్ట్ ప్రాంతంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో నటుడు మంచు మనోజ్‌తో కలిసి యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్న బాలకృష్ణ మోకాలికి గాయమైంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు.
వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స అనంతరం నాలుగు నుంచి ఐదు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే నిర్ణయించిన సినిమా షూటింగ్ షెడ్యూళ్లు, కొన్ని ప్రజా కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం.
)
అయితే (Balakrishna) బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు చిత్ర బృందం, వైద్య వర్గాలు స్పష్టత ఇచ్చాయి. గాయం తీవ్రంగా లేదని, చికిత్స అనంతరం ఆయన పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ చిన్న విరామం కారణంగా సినిమా విడుదల ప్రణాళికలపై పెద్దగా ప్రభావం ఉండదని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నటులు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

‘వీరసింహారెడ్డి’ విజయానంతరం దర్శకుడు గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న ఈ కొత్త చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
Also read:
