CarLoan: కారు లోన్ కట్టేశారా?

CarLoan

CarLoan

కారు కొనుగోలు కోసం రుణం తీసుకోవడం ప్రస్తుతం చాలా మందికి సాధారణ విషయమే. అయితే (CarLoan) కారు లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత చాలామంది ఇక అన్ని ప్రక్రియలు ముగిసిపోయాయని భావిస్తారు. కానీ వాస్తవానికి లోన్ క్లియర్ అయిన తర్వాత కూడా కొన్ని కీలకమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కారు విక్రయం, యాజమాన్య బదిలీ వంటి పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మొదటగా, చివరి ఈఎంఐ చెల్లించిన తర్వాత సంబంధిత బ్యాంకు నుంచి No Objection Certificate (NOC), (CarLoan) లోన్ పూర్తిగా ముగిసినట్లు ధ్రువీకరణ పత్రం, Form 35, అలాగే ఒరిజినల్ ఆర్సీ (RC) వంటి పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం వీటి జిరాక్స్ లేదా డిజిటల్ కాపీలను కూడా భద్రంగా ఉంచుకోవడం మంచిది.

Explainer | Paid the last EMI on your car loan? Know the five things you  need to do right after- Moneycontrol.com

రెండవ దశలో, Parivahan పోర్టల్ ద్వారా Hypothecation Termination కోసం దరఖాస్తు చేయాలి. లోన్ కొనసాగుతున్న సమయంలో వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)పై బ్యాంక్ పేరు నమోదై ఉంటుంది. లోన్ పూర్తయిన తర్వాత ఆ నమోదు తొలగించకపోతే బ్యాంక్ పేరు అలాగే కొనసాగుతుంది. అందుకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి నిర్ణీత రుసుము చెల్లించాలి.

మూడవ దశలో, ఆయా రాష్ట్రాల రవాణా శాఖ పోర్టల్‌లో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి ఆర్సీని అప్‌డేట్ చేయించుకోవాలి. తెలంగాణ వాహనదారులు TG RTA పోర్టల్, ఆంధ్రప్రదేశ్ వాహనదారులు AP Transport పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ధృవీకరణ అనంతరం సాధారణంగా కొన్ని వారాల్లో కొత్త RC కార్డు జారీ అవుతుంది.

Why Americans are struggling with car loans

నాలుగవ దశలో, మీ కారు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా బ్యాంకు జారీ చేసిన NOCను సమర్పించాలి. దీంతో ఇన్సూరెన్స్ రికార్డుల్లో కూడా బ్యాంక్ పేరు తొలగించబడుతుంది. అనంతరం RCలో హైపోథికేషన్ తొలగించబడిందో లేదో ఆన్‌లైన్‌లో ఒకసారి పరిశీలించడం మంచిది.

ఈ నాలుగు ప్రక్రియలు పూర్తయిన తర్వాతే వాహనంపై పూర్తి యాజమాన్య హక్కులు మీ పేరుకు వస్తాయి. భవిష్యత్తులో కారు విక్రయం లేదా యాజమాన్య బదిలీ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఈ దశలను తప్పకుండా పూర్తి చేయడం అవసరం.

Also read: