TVS Jupiter: రూ.90 వేల లోపు సీక్రెట్ ఫీచర్లు ఇవే!

TVS Jupiter

TVS Jupiter

(TVS Jupiter) టీవీఎస్ జూపిటర్ సిరీస్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఈ క్రమంలో కంపెనీ కొత్తగా Jupiter Dual Tone Spectral Editionను తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, మంచి మైలేజీతో రూ.90 వేల లోపు ధరలో అందుబాటులోకి వచ్చిన ఈ స్కూటర్ రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా రూపొందించారు.

TVS Jupiter 110 colours image gallery - Introduction | Autocar India

ఈ కొత్త (TVS Jupiter) జూపిటర్ Spectral Blue, Spectral Copper అనే రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 110cc విభాగంలో డ్యూయల్ టోన్ స్పెక్ట్రల్ ఆప్షన్‌తో వచ్చిన ప్రత్యేక మోడల్‌గా ఇది నిలుస్తుంది. ఇందులో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు, పాక్షిక క్రోమ్ మిర్రర్లు వంటి డిజైన్ హైలైట్స్ ఉన్నాయి.

TVS Jupiter Dual Tone - Price, Mileage, Images, Colours, Specs

రైడర్, పిలియన్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాక్ సపోర్ట్‌తో కూడిన విశాలమైన సీటును అందించారు. అలాగే సీటు కింద 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉండటంతో రెండు హెల్మెట్లు పెట్టుకునే అవకాశం ఉంది. SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్ పొందవచ్చు. మొబైల్ ఛార్జింగ్ కోసం USB Type-C పోర్ట్ కూడా ఉంది.

2025 New TVS Jupiter 113 All Models Explained | Base vs Mid vs Top Variant  | Full Comparison 🔥 | Xtreme BHP | Facebook

పనితీరు విషయానికి వస్తే ఇందులో 113.3cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 7.9 hp పవర్, 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం లీటరుకు 61 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది.

ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.89,825గా ఉంది. ప్రీమియం లుక్, స్మార్ట్ ఫీచర్లు, స్టోరేజ్, మైలేజీ కోరుకునే వారికి ఈ మోడల్ ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలవనుంది.

Also read: