సాధారణంగా అన్నంలో కలుపుకుని తినేందుకు పుట్నాల పొడి, పల్లీ కారం, నువ్వుల కారం, కరివేపాకు పొడి వంటి ఎన్నో రకాల కారం పొడులు తయారు చేసుకుంటాం. నాన్‌వెజ్ ఇష్టపడేవారు చికెన్ కారం పొడి, రొయ్యల కారం పొడి కూడా చేసుకుంటారు. అయితే ఒక్కసారి (Mutton Karam) మటన్ కారం పొడి కూడా ట్రై చేసి చూడండి. అన్నంతో పాటు రోటీ, టిఫిన్స్‌తోనూ ఇది అదిరిపోయే కాంబినేషన్‌గా ఉంటుంది.
ఈ కారం పొడి తయారీకి 250 గ్రాముల బోన్‌లెస్ మటన్, 20 ఎండు మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాలు, 15 వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, ఉప్పు, వేయించేందుకు నూనె అవసరం.
ముందుగా(Mutton Karam) మటన్‌కు కొద్దిగా నీరు, పసుపు, ఉప్పు వేసి కుక్కర్‌లో సుమారు 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అనంతరం ముక్కల్లో నీరు ఉంటే పూర్తిగా ఆవిరయ్యేలా సన్నని మంటపై ఉంచాలి. తర్వాత నూనెలో మటన్ ముక్కలను బాగా వేయించి ముదురు రంగులోకి వచ్చే వరకు క్రిస్పీగా చేసుకోవాలి.
మరో పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిని దోరగా వేయించి చల్లార్చాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, మిరియాలను గ్రైండ్ చేసి, తర్వాత మిగిలిన పదార్థాలను కలిపి పొడి చేసుకోవాలి. చివరగా ఉప్పు, వేయించిన మటన్ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేస్తే రుచికరమైన మటన్ కారం పొడి సిద్ధం.
తేమ లేని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే సుమారు 15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చని ఈ రెసిపీ చెబుతోంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నూనెతో కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది.
Also read:
