Manchu Manoj: “మీ అన్నయ్యను నాకు ఇచ్చేయ్!”

Manchu Manoj

Manchu Manoj

టాలీవుడ్‌లో మంచు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే గతంలో మంచు విష్ణు, (Manchu Manoj) మంచు మనోజ్ మధ్య చోటుచేసుకున్న విభేదాలు తీవ్ర చర్చకు దారితీశాయి. కుటుంబ వివాదం పోలీస్ స్టేషన్, కోర్టు, అధికారుల వరకు వెళ్లినప్పటికీ.. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయి. అన్నదమ్ములు కూడా మళ్లీ కలిసిపోయి ఒకరి సినిమాలను మరొకరు ప్రశంసించుకున్నారు.

The Telugu promotional interview featuring #Karthi, #SJSuryah and Manchu  Manoj for #Sardar2 feels less like a regular movie promotion and more like  three friends casually sitting together and talking. The conversation is

ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన (Manchu Manoj) మంచు మనోజ్.. పలు ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ‘సర్దార్ 2’ విడుదలకు సిద్ధమవుతోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్‌జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా కార్తీ, ఎస్‌జే సూర్యతో మంచు మనోజ్ సరదాగా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీ, సూర్యల మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధాన్ని మనోజ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూర్య తనను తమ్ముడిగా కాకుండా కొడుకులా చూసుకుంటారని, వారి బంధం ఎంతో ముచ్చటగా ఉంటుందని ప్రశంసించారు.

తాను, విష్ణు కూడా అలాంటి బంధంతో ఉండాలని కోరుకుంటున్నామని మనోజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సరదాగా “బ్రదర్స్‌ను ఎక్స్చేంజ్ చేసుకుందాం. విష్ణును నువ్వు తీసుకో.. సూర్య అన్నను నాకు ఇచ్చేయ్” అంటూ కార్తీకి ఫన్నీ ఆఫర్ ఇచ్చారు. దీనికి కార్తీ కూడా నవ్వుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.

Also read: