(Ram Charan) తాజాగా చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. భోపాల్‌లో జరిగిన Peddi మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కార్యక్రమంలో వివిధ క్రీడాకారుల గురించి మాట్లాడిన రాంచరణ్, Sachin Tendulkarను “లెజెండరీ”గా, MS Dhoniను “కామ్ అండ్ కూల్”గా, Virat Kohliను “ఫైర్”గా, Rohit Sharmaను “ఎవ్రీబాడీస్ మాన్”గా అభివర్ణించారు.

అయితే ఈ క్రమంలో Jasprit Bumrah గురించి మాట్లాడుతూ పొరపాటున “ఫుట్‌బాలర్” అని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భారీగా ట్రోల్స్, మీమ్స్ చేయడం ప్రారంభించారు.
చాలామంది అభిమానులు ఇది సాధారణ పొరపాటు మాత్రమేనని భావించినప్పటికీ, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌తో వైరల్ చేశారు. “బూమ్రా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ నుంచి ఫుట్‌బాలర్ అయ్యాడా?” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.
ఈ ట్రోల్స్ వైరల్ కావడంతో (Ram Charan) ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్య అనుకోకుండా జరిగిన పొరపాటని, దానికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.

అలాగే Jasprit Bumrahపై తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన భారత క్రికెట్‌కు గర్వకారణమని చెర్రీ వెల్లడించారు. దీంతో అభిమానులు కూడా ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో, చెర్రీ క్షమాపణలు, సోషల్ మీడియా మీమ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సినిమా ఈవెంట్‌లో జరిగిన చిన్న పొరపాటు ఇప్పుడు భారీ వైరల్ టాపిక్‌గా మారింది.
Also read:
