iPhone: Phone ధరలు భారీగా పెరిగాయి!

iPhone

iPhone

ఆపిల్‌ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. కొత్త (iPhone) ఐఫోన్ తరం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సాధారణంగా పాత మోడళ్ల ధరలు తగ్గుతాయని భావిస్తారు. కానీ భారత్‌లో ఆపిల్‌ ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. కొన్ని ఐఫోన్ మోడళ్ల ధరలను భారీగా పెంచింది. ఐఫోన్ 16, ఐఫోన్ 17, ఐఫోన్ 17e, ఐఫోన్ ఎయిర్‌ మోడళ్లలోని పలు స్టోరేజ్ వేరియంట్ల ధరలు సవరించింది.

ధరల పెంపులో అత్యధికంగా ప్రభావితమైనది (iPhone) ఐఫోన్ ఎయిర్‌. దీని 256GB వేరియంట్ ధర రూ.1,02,900 నుంచి రూ.1,49,900కు పెరిగింది. 512GB మోడల్ రూ.1,39,900 నుంచి రూ.1,74,900కు చేరింది. ఇక 1TB వెర్షన్ ధర ఏకంగా రూ.1,59,900 నుంచి రూ.2,24,900కు పెరిగింది. అంటే రూ.65,000 భారీ పెరుగుదల నమోదైంది.

ఎంట్రీ లెవల్ ఐఫోన్ 16 128GB ధర కూడా రూ.69,900 నుంచి రూ.89,900కు పెరిగింది. అంటే రూ.20,000 పెరిగింది. ఐఫోన్ 17 256GB ధర రూ.82,900 నుంచి రూ.99,900కు, 512GB వెర్షన్ రూ.1,02,900 నుంచి రూ.1,24,900కు చేరాయి.

ఐఫోన్ 17e 256GB ధర రూ.64,900 నుంచి రూ.79,900కు, 512GB ధర రూ.84,900 నుంచి రూ.1,04,900కు పెరిగింది. దీంతో ఆపిల్‌ కొత్త ధరలపై చర్చ మొదలైంది.

ఇదిలా ఉంటే, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ విడుదల నేపథ్యంలో ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్‌ మోడళ్లను ఆపిల్‌ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌ నుంచి తొలగించింది. అయితే రానున్న Flipkart Big Billion Days, Amazon Great Indian Festival సేల్స్‌లో ఈ మోడళ్లపై డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.

Also read: