Hanuman Ansh: హనుమాన్ అన్ష్ బాక్సాఫీస్ విధ్వంసం!

Hanuman Ansh

Hanuman Ansh

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తే ఆ సినిమాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అలాంటి సంచలన విజయాన్ని అందుకుంటున్న చిత్రంగా (Hanuman Ansh) హనుమాన్ అన్ష్ నిలుస్తోంది. శోభినవ్ సత్య, విహన్ షెడ్గే, చందన్ కే ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి తదితరులు నటించిన ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. హనుమాన్ భక్తుడి నేపథ్యంలోని డివోషనల్ కథతో ఈ సినిమా రూపొందింది.

సుమారు రూ.2 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ (Hanuman Ansh) మూవీకి ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు రూ.3 కోట్లుగా పేర్కొన్నారు. సుమారు రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి వారంలో రూ.1 కోటి, రెండో వారంలో రూ.40 లక్షలు మాత్రమే వసూలు చేసి రెండు వారాల్లో రూ.1.40 కోట్లకు చేరుకుంది.

అయితే మూడో వారం నుంచి సినిమా పాజిటివ్ టాక్ బలంగా వ్యాపించడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగాయి. మూడో వారంలో రూ.10 కోట్లు, నాలుగో వారంలో రూ.61 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో నాలుగు వారాల్లోనే రూ.71.4 కోట్ల వసూళ్లు సాధించింది.

29వ రోజు నుంచి కూడా కలెక్షన్ల జోరు కొనసాగింది. 35వ రోజు సాయంత్రం వరకు సుమారు రూ.9.5 కోట్ల వసూళ్లు నమోదయ్యాయని, రోజు ముగిసే సమయానికి రూ.12-14 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. దీంతో ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

గమనిక: బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించిన గణాంకాలు ట్రేడ్ రిపోర్టులు, ప్రొడక్షన్ హౌస్‌లు, సోషల్ మీడియా ద్వారా వెల్లడైన వివరాల ఆధారంగా ఉంటాయి. తుది అధికారిక గణాంకాల్లో మార్పులు ఉండవచ్చు.

Also read: