Trains: వినాయక చవితికి స్పెషల్ ట్రైన్లు!

Trains

Trains

వినాయక చవితి సందర్భంగా వరుస సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన (Trains) రైళ్లలో రిజర్వేషన్లు పూర్తవడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–తిరుచానూరు, గుంటూరు–వికారాబాద్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది.

(Trains) రైలు నంబర్ 07039 చర్లపల్లి–కాకినాడ టౌన్ సెప్టెంబర్ 11, 13 తేదీల్లో రాత్రి 7.50 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07040 కాకినాడ–చర్లపల్లి సెప్టెంబర్ 12, 14 తేదీల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి.

07025 చర్లపల్లి–తిరుచానూరు సెప్టెంబర్ 11న సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుచానూరు చేరుతుంది. 07026 తిరుచానూరు–చర్లపల్లి సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 1.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఈ రైళ్లకు హాల్టింగ్ ఉంటుంది.

అలాగే 07227, 07228 నంబర్లతో గుంటూరు–వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలో ఇవి ఆగుతాయి.

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Also read: