సాధారణంగా ఇంట్లో ఎవరైనా గ్యాస్ వదిలితే నవ్వుకుని వదిలేస్తాం. కానీ (Canada) కెనడాలో మాత్రం ఇదే కారణంగా ఓ జంట ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిత్తు వదులుతున్నారనే కారణంతో ఇంటి యజమానురాలు తమకు ఎవిక్షన్ నోటీసు ఇచ్చిందని ఆ జంట ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ వింత వివాదం కోర్టుకు చేరడంతో వార్త వైరల్గా మారింది.
(Canada) కెనడాలోని టొరంటోకు చెందిన ఎస్.ఈ. గ్రుమ్మెట్, సామ్ క్రూగర్ అనే జంట కలిసి నివసిస్తున్నారు. వీరు ‘క్రీపీ బాయ్స్’ పేరుతో కామెడీ, హారర్ కామెడీ ప్రదర్శనలు నిర్వహించే కళాకారులు. వీరు ఉంటున్న ఇంటి పై అంతస్తులో యజమానురాలు తానియా అండర్సన్ నివసిస్తున్నారు.
డిసెంబర్ 2025లో ఇంట్లో ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ మానిటర్లో వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOC) స్థాయిలు పెరిగినట్లు కనిపించాయి. దీంతో తన ఇంట్లో ఉండే అద్దెదారులు సిగరెట్లు తాగుతున్నారని యజమానురాలు అనుమానించారు. అయితే తాము ఎలాంటి పొగతాగడం లేదని ఆ జంట స్పష్టం చేసింది.
దీంతో గాలి నాణ్యతలో మార్పులకు కారణమేంటని పరిశీలించిన అద్దెదారులకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మన శరీరం నుంచి వెలువడే వాయువులు కూడా VOC రీడింగ్స్పై ప్రభావం చూపవచ్చని వారు తెలుసుకున్నారు. ముఖ్యంగా రాత్రిపూట రీడింగ్స్ పెరగడం తమ వాదనకు ఆధారమని చెబుతున్నారు.
అయితే యజమానురాలు వారి వివరణను అంగీకరించకుండా జూన్ 29న N12 ఎవిక్షన్ నోటీసు ఇచ్చినట్లు వారు ఆరోపించారు. దీనిని ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
ఈ కేసు అక్టోబర్ 29న ఒంటారియో ల్యాండ్లార్డ్ అండ్ టెనెంట్ బోర్డు ముందుకు వెళ్లింది. నవంబర్ 10 నాటికి తీర్పు వెలువడలేదు. ఈ వింత వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Also read:
