Yamaha: యమహా Aerox 155 ధర పెంపు

Yamaha

Yamaha

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తన ప్రముఖ (Yamaha) Aerox 155 మోడల్ ధరలను పెంచింది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మాక్సీ-స్కూటర్ ధరలు ₹2,800 వరకు పెరిగాయి. దీంతో వినియోగదారులపై కొంత అదనపు భారం పడనుంది. అయితే ధరలు పెరిగినప్పటికీ, స్పోర్టీ డిజైన్‌, శక్తివంతమైన ఇంజిన్‌, ఆధునిక ఫీచర్ల కారణంగా ఈ స్కూటర్ యువతలో ఇప్పటికీ మంచి క్రేజ్‌ను కొనసాగిస్తోంది.

Image

(Yamaha) Aerox 155 భారత మార్కెట్లో ప్రీమియం మాక్సీ-స్కూటర్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ స్కూటర్‌లో 155cc లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4-వాల్వ్ ఇంజిన్ అందించారు. ఇది 15PS పవర్‌తో పాటు 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ మరియు V-బెల్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెర్ఫార్మన్స్‌ను మరింత మెరుగుపరిచారు.

Image

మైలేజ్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ సుమారు 40 నుంచి 45 kmpl వరకు ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. టాప్ స్పీడ్ సుమారు 115 kmph వరకు ఉంటుంది. E20 ఫ్యూయల్‌కు అనుకూలంగా ఉండటం దీని మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఫీచర్ల పరంగా కూడా Yamaha Aerox 155 ఎంతో ఆధునికంగా రూపొందించబడింది. Y-Connect బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్, SMS, ఇమెయిల్ అలర్ట్స్‌తో పాటు ఫోన్ బ్యాటరీ స్టేటస్ కూడా చూడవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ABS సేఫ్టీ, LED లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు స్కూటర్‌ను మరింత ప్రీమియంగా మార్చుతున్నాయి.

Yamaha scooters, bikes prices hiked - Introduction | Autocar India

Version S వేరియంట్‌లో స్మార్ట్ కీ సిస్టమ్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ ట్రాకింగ్, మాల్ ఫంక్షన్ నోటిఫికేషన్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. సస్పెన్షన్ కోసం ముందు టెలిస్కోపిక్, వెనుక యూనిట్ స్వింగ్ సెటప్ ఇచ్చారు. ముందు డిస్క్ బ్రేక్‌కు ABS సపోర్ట్ కూడా అందించారు.

డిజైన్ పరంగా ఈ స్కూటర్ స్పోర్టీ లుక్‌తో యువతను ఆకట్టుకుంటోంది. 790 mm సీట్ హైట్, 145 mm గ్రౌండ్ క్లియరెన్స్, 5.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం దీన్ని నగర ప్రయాణాలకు అనువుగా మారుస్తున్నాయి.

Yamaha Aerox 155: All You Need To Know

ధరల విషయానికి వస్తే, తెలంగాణ ఎక్స్ షోరూమ్ ప్రకారం స్టాండర్డ్ వేరియంట్ ధర ₹1,43,120 కాగా, Version S ధర ₹1,46,120గా ఉంది. ధరలు పెరిగినప్పటికీ స్టైల్, టెక్నాలజీ, పెర్ఫార్మన్స్ కలయికతో ఈ స్కూటర్ యువతకు ఆకర్షణీయమైన ఎంపికగా కొనసాగుతోంది.

Also read: