(Royal Enfield) మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటింది. ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ విశ్లేషణ సంస్థ విడుదల చేసిన “బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ 2026” రిపోర్ట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ టాప్ 3 ఆటోమోటివ్ బ్రాండ్లలో స్థానం సంపాదించింది. Toyota, BMW వంటి అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్ల సరసన భారత బ్రాండ్ నిలవడం దేశ ఆటోమొబైల్ రంగానికి గర్వకారణంగా మారింది.
ఈ రిపోర్ట్ ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు 100లో 88.9 బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోర్ లభించింది. వినియోగదారుల విశ్వాసం, మార్కెట్ ప్రభావం, గ్లోబల్ గుర్తింపు, బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాల్లో కంపెనీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
అంతేకాదు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు పెరుగుతున్న ఆదరణే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ 80కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. భారత మార్కెట్‌తో పాటు యూరప్, అమెరికా, ఆసియా దేశాల్లో కూడా ఈ బైక్స్‌కు భారీ డిమాండ్ కొనసాగుతోంది.
ప్రత్యేకంగా (Royal Enfield) Hunter 350, Royal Enfield Super Meteor 650, Royal Enfield Himalayan 450 మోడళ్లకు యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, లాంగ్ రైడింగ్ అనుభవం ఈ బైక్స్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా అడ్వెంచర్ మరియు టూరింగ్ బైక్ సెగ్మెంట్‌లో హిమాలయన్ 450 మంచి క్రేజ్ సంపాదించింది.
ఈ జాబితాలో భారత కంపెనీలైన Tata Motors, Mahindra & Mahindra, Maruti Suzuki కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. భారత ఆటోమొబైల్ రంగం ప్రపంచ మార్కెట్లో వేగంగా ఎదుగుతోందని ఈ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ సాధించిన ఈ ఘనత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఇండియన్ బ్రాండ్ గ్లోబల్ స్థాయిలో మెరిసింది” అంటూ నెటిజన్లు గర్వం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
