Post Office: రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్

Post Office

Post Office

(Post Office Schemes) సంప్రదాయ పెట్టుబడిదారులకు పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. వీటిల్ల ోఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏప్రిల్- జూన్ 2026 త్రైమాసికానికి వడ్డీ రేట్లు మారకుండా స్థిరంగా ఉన్నాయి. అత్యధికంగా సుకన్య సమృద్ధి అకౌంట్, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20 శాతంగా ఉంది. పూర్తి వివరాల్ని చూద్దాం.
Small Savings Schemes Interest Rates 2026: పెట్టుబడులు పెట్టేందుకు మనకు చాలానే ఆప్షన్లు ఉన్నాయి. కానీ రిస్క్ ఉన్నవి, రిస్క్ లేని స్కీమ్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి దీర్ఘకాలంలో మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక రిస్క్ లేని పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా చాలానే ఉంటాయి. ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరంగా కచ్చితమైన రిటర్న్స్ ఇస్తాయి. వీకం స్టిల్లో చాలా పథకాల్లో దీర్ఘకాలంలో మంచి రాబడి అందడంతో పాటుగా పన్ను ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో పాత పన్ను విధానంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుల్ని పొందే వీలుంటుంది.

ఈ (Post Office) పోస్టాఫీస్ పథకాల్లో ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌‌కం స్కీమ్ వంటివి అత్యంత ఆదరణ పొందాయి. వీటిల్లో అత్యధికంగా సుకన్య సమృద్ధితో పాటుగా సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీంలో వడ్డీ రేట్లు వార్షికంగా 8.20 శాతంగా ఉంది. సాధారణంగా ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. చాలా కాలంగా రేట్లు స్థిరంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు అమల్లో ఉండగా.. జులై- సెప్టెంబర్ త్రైమాసికం వడ్డీ రేట్లను మళ్లీ సమీక్షించనుంది. ఈ స్కీమ్స్ గురించి చూద్దాం.

Also read: