ప్రకృతి (Flowers) అందించే పూలు కేవలం అందం, సువాసనకే పరిమితం కావు. ఇవి జుట్టు సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో పూలను చర్మం, కేశాల సంరక్షణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కాలుష్యం, దుమ్ము, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలడం, తెల్లబడడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. మార్కెట్‌లో లభించే ఖరీదైన ఉత్పత్తులు వాడినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సహజ మార్గాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో మన ఇంటి పరిసరాల్లో సులభంగా లభించే పూలతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా Hibiscus పూలు జుట్టు సంరక్షణలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు, అమైనో యాసిడ్లు జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. మందార పూల రేకులను మెత్తగా నూరి, కొబ్బరి నూనె, పెరుగు కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగిస్తే కుదుళ్లు బలపడతాయి. అలాగే ఈ పూలను నూనెలో మరిగించి తయారు చేసే హెయిర్ ఆయిల్ సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది.
ఇక సాధారణంగా కనిపించే Oleander (బిళ్ల గన్నేరు) పూలు (Flowers) కూడా కేశాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఈ పూల రేకులను కొబ్బరి నూనె లేదా ఆముదం నూనెలో మరిగించి తయారు చేసిన ఆయిల్‌ను వాడితే జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. అలాగే మందార పూలు, కలబంద, పెరుగు కలిపి తయారు చేసే మాస్క్‌ను వారానికి రెండు సార్లు వాడటం మంచి ఫలితాలు ఇస్తుంది.
Marigold (బంతి పూలు) కూడా జుట్టు సమస్యలకు సహజ పరిష్కారంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి. బంతి పూలతో తయారు చేసిన నూనెలను కొబ్బరి నూనెతో కలిపి వాడటం వల్ల చుండ్రు తగ్గుతుంది.

అలాగే Chrysanthemum (చామంతి పూలు) తల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చామంతి పూల టీని షాంపూ తర్వాత కండిషనర్‌గా ఉపయోగిస్తే జుట్టు మృదువుగా మారుతుంది. ఈ పూలు స్కాల్ప్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి.
ఇక Lavender పూల నుంచి తయారయ్యే ఆయిల్ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరం. ఇది యాంటీ సెప్టిక్ గుణాలతో చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించి జుట్టు వేగంగా పెరగడంలో సహాయపడుతుంది.

మొత్తానికి పూలు కేవలం అలంకరణకే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచే సహజ ఔషధాలుగా పనిచేస్తాయి. సహజ పద్ధతులను పాటించడం ద్వారా జుట్టు సమస్యలకు సురక్షితమైన పరిష్కారం పొందవచ్చు.
Also read:
