మన హిందూ వివాహ సంప్రదాయాల్లో చివరి ఘట్టంగా జరిగేది “అప్పగింతలు”. సాధారణంగా ఈ సమయంలో వధువును ఆమె తల్లిదండ్రులు (Groom) వరుడి కుటుంబానికి అప్పగిస్తారు. పుట్టింటిని వదిలి వెళ్లే క్షణాల్లో వధువు, ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో ఈ సంప్రదాయం పూర్తిగా విరుద్ధంగా కనిపించింది.
Surguja district లోని మయిన్పత్ తాలూకా సుపల్గా గ్రామంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16న 23 ఏళ్ల యువకుడు (Groom) బిలాసుస్ బర్వ వివాహం జరిగింది. ఆయన సమీప గ్రామానికి చెందిన రైతు Mohan Ekka కుమార్తె దేవముణి ఎక్కాను పెళ్లి చేసుకున్నాడు.
మోహన్ ఎక్కాకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ అందరూ ఆడపిల్లలే. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి ఒక అబ్బాయి అవసరం ఉందని భావించిన ఆయన, తన కుమార్తె పెళ్లి సమయంలోనే అల్లుడిని ఇల్లరికం తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను వరుడి కుటుంబం కూడా అంగీకరించింది.
అనుకున్న ప్రకారం వరుడి ఇంటి వద్దే వివాహం ఘనంగా జరిగింది. సంప్రదాయ కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. అయితే చివరగా జరిగిన అప్పగింతలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. వధువును కాకుండా వరుడినే అతడి తల్లిదండ్రులు అత్తమామల కుటుంబానికి అప్పగించారు.
ఈ సమయంలో వరుడు తన తల్లిదండ్రులు, సోదరులు, కుటుంబ సభ్యులను వదిలి వెళ్లాల్సి రావడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీళ్లు ఆపుకోలేక భోరున విలపించాడు. ఈ దృశ్యం చూసిన అక్కడి వారు కూడా కంటతడి పెట్టుకున్నారు.
ఇక వధువు తండ్రి మోహన్ ఎక్కా మాత్రం ఆనందం వ్యక్తం చేశాడు. తనకు కొడుకు లేనందున అల్లుడినే కొడుకులా భావిస్తున్నానని తెలిపారు. బిలాసుస్ బర్వ తమ కుటుంబ బాధ్యతలను చూసుకుంటాడని, ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. “అతడు నాకు అల్లుడు కాదు, కొడుకే” అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే—సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కుటుంబ అవసరాలు, పరస్పర అంగీకారం ఉంటే సంప్రదాయాలు ఎలా మారవచ్చో ఈ ఘటన స్పష్టంగా చూపించింది.
Also read:
