Aarogya Setu: రీల్ చేయండి.. రూ.50,000 గెలుచుకోండి!

Aarogya Setu

Aarogya Setu

రీల్స్ చేయడం అంటే ఇష్టమా? అయితే యువతకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అస్సలు మిస్ కావద్దు. డిజిటల్ హెల్త్ సేవలపై అవగాహన కల్పించేందుకు National Health Authority (NHA), myGov సంయుక్తంగా (Aarogya Setu) 2.0 Reel Making Competition నిర్వహిస్తున్నాయి. ఇందులో ఉత్తమంగా నిలిచిన రీల్‌కు ఏకంగా రూ.50,000 నగదు బహుమతి అందించనున్నారు.

ఈ పోటీలో పాల్గొనే వారు (Aarogya Setu) యాప్‌లోని డిజిటల్ హెల్త్ ఫీచర్లను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా రీల్‌లో చూపించాలి. ABHA కార్డు క్రియేషన్, డిజిటల్ హెల్త్ కార్డ్ యాక్సెస్, సమీపంలోని జన ఔషధి కేంద్రాల సమాచారం, Scan & Pay, Smart AI, Health Dashboard వంటి ఫీచర్లను రీల్‌లో ప్రదర్శించవచ్చు.

ఒక వ్యక్తి, కుటుంబం లేదా వృద్ధులు Aarogya Setu సేవలను ఎలా ఉపయోగించుకుంటున్నారో స్కిట్, యానిమేషన్ లేదా క్రియేటివ్ వీడియో రూపంలో చూపించే అవకాశం ఉంది. భారతదేశంలో డిజిటల్ హెల్త్ సేవలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా వివరించాలి.

పోటీలో పాల్గొనేవారు భారతీయ పౌరులై ఉండాలి. రీల్ పూర్తిగా ఒరిజినల్‌గా ఉండటంతో పాటు గతంలో ఎక్కడా ప్రచురించనిదై ఉండాలి. వీడియో పోర్ట్రెయిట్ మోడ్‌లో MP4 ఫార్మాట్‌లో, గరిష్ఠంగా 90 సెకన్ల నిడివితో ఉండాలి. రాజకీయ, మతపరమైన లేదా అనుచిత కంటెంట్‌కు అనుమతి లేదు.

ముందుగా రీల్‌ను YouTube లేదా Instagramలో పబ్లిక్‌గా అప్‌లోడ్ చేసి, ఆ లింక్‌ను myGovలోని సంబంధిత కాంటెస్ట్ టాస్క్‌లో సమర్పించాలి. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు.

సెప్టెంబర్ 9, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తులు/ఎంట్రీలు స్వీకరిస్తారు. విజేతల వివరాలను myGov పోర్టల్‌లో ప్రకటిస్తారు. రీల్స్ చేయడంపై ఆసక్తి ఉన్న యువతకు ఇది ప్రతిభను చూపించడంతో పాటు నగదు బహుమతి గెలుచుకునే మంచి అవకాశం.

Also read: