India: ఇథనాల్ ఆధారిత కారును విడుదల

India

India

(India) భారత ఆటోమొబైల్ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. పెట్రోల్‌కు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా దేశంలో తొలి ఇథనాల్ ఆధారిత కారును నేడు అధికారికంగా పరిచయం చేయనున్నారు. ఈ కొత్త సాంకేతికతతో నడిచే వాహనం పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించి ప్రయాణించగలదు.

ఇథనాల్ అనేది ప్రధానంగా చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయో ఇంధనం. పర్యావరణానికి అనుకూలమైన ఇంధనంగా దీనిని ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయి. ఇప్పుడు (India) భారత్ కూడా ఈ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది.

I've got some electrifying news! In Brazil, we have announced the  production of a new type of hybrid that combines an electric motor with a  flexfuel engine. This will be the first

ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగం పెరగడం వల్ల దేశం దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం కొంత మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో విదేశీ మారక ద్రవ్య వ్యయం తగ్గడమే కాకుండా ఇంధన భద్రత కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

మరోవైపు ఈ నిర్ణయం రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు అదనపు ఆదాయ వనరులు లభించవచ్చు. వ్యవసాయ ఉత్పత్తులను ఇంధన తయారీలో వినియోగించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు కూడా ఇది కొంత ఉపశమనం కలిగించే మార్గంగా భావిస్తున్నారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగం విస్తృతంగా పెరిగితే భవిష్యత్తులో వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో తీసుకొచ్చిన ఈ ప్రయత్నం భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఈ కొత్త సాంకేతికతకు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also read: