భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీల్లో ఒకటైన Toyota Innova Crysta 2026 కొత్త అవతారంలో వినియోగదారుల ముందుకు వచ్చింది. టయోటా సంస్థ 2026 (Innova) ఇన్నోవా క్రిస్టా మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతా సదుపాయాలతో ఈ వాహనం కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
కొత్త (Innova) ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.72 లక్షలుగా నిర్ణయించారు. తాజా మోడల్‌లో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, మరింత ఆకర్షణీయమైన బాహ్య రూపాన్ని అందించే స్టైలింగ్ మార్పులు చేశారు. దీంతో వాహనానికి మరింత ప్రీమియం లుక్ వచ్చింది.
ఇంటీరియర్ పరంగా కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఆధునిక ఫీచర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
భద్రత విషయంలో టయోటా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ కొత్త మోడల్‌లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో కూడిన EBD, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక భద్రతా సదుపాయాలు అందించారు. కుటుంబ ప్రయాణాలకు అనువైన వాహనంగా ఇన్నోవా క్రిస్టా ఇప్పటికే మంచి పేరు సంపాదించగా, తాజా భద్రతా అప్‌డేట్స్‌తో ఆ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
పనితీరు పరంగా కూడా ఈ ఎంపీవీ ఆకట్టుకునే అవకాశముంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, లీటరుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజీ అందించగలదని పేర్కొంది. దీర్ఘ ప్రయాణాలు చేసే కుటుంబాలు, వ్యాపార అవసరాల కోసం వాహనం ఉపయోగించే వారికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు.
భారత ఎంపీవీ మార్కెట్లో ఇప్పటికే బలమైన స్థానాన్ని కలిగి ఉన్న ఇన్నోవా క్రిస్టా, 2026 అప్‌డేట్స్‌తో మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. డిజైన్, భద్రత, సౌకర్యం, విశ్వసనీయత కలయికగా ఈ వాహనం మార్కెట్లో ఎలా రాణిస్తుందో చూడాలి.
Also read:
