Vijay: మద్యం దుకాణాలపై విజయ్ తొలి వేట

తమిళనాడులో మద్యం దుకాణాల మూసివేత నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది(Vijay). ముఖ్యంగా గుడులు, పాఠశాలలు మరియు బస్‌స్టాండ్ల సమీపంలో ఉన్న 717 టాస్మాక్ మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు Vishal స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. “హ్యాట్సాఫ్ టు విజయ్” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారుతున్న Vijay మద్యం దుకాణాల అంశంపై తీసుకున్న వైఖరిని విశాల్ అభినందించారు. ముఖ్యంగా అమ్మాయిలు మరియు విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం ఎంతోమందికి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.

ఆర్కే నగర్ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని ఫిర్యాదును కూడా విశాల్ ప్రస్తావించారు. ప్రతిరోజూ స్కూల్ లేదా కాలేజీకి వెళ్లేటప్పుడు వైన్స్ షాపుల మధ్య నుంచి వెళ్లాల్సి వస్తోందని, అక్కడ వేధింపులు ఎదురవుతున్నాయని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇలాంటి సమస్యలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు మరియు బాలికలకు కొంత భద్రత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ మద్యం దుకాణాలు నిర్వహణలో ఉన్నట్లు సమాచారం. వీటిలో ఆలయాల వద్ద 276, విద్యాసంస్థల సమీపంలో 186, బస్‌స్టాండ్ల వద్ద 255 దుకాణాలు ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని రెండు వారాల్లో ఈ షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

విశాల్ మాట్లాడుతూ “ఈ నిర్ణయం సామాన్య ప్రజలు కూడా స్వాగతిస్తారు. ఎంతోమంది ముఖాల్లో చిరునవ్వు తీసుకొచ్చారు” అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళల భద్రత దృష్ట్యా ఇది మంచి నిర్ణయమని కామెంట్లు చేస్తున్నారు.

ఇక టాస్మాక్ వ్యవహారం గతంలో కూడా వివాదాల్లో నిలిచింది. మద్యం దుకాణాల నిర్వహణలో వేల కోట్ల రూపాయల అక్రమాలపై Enforcement Directorate గతంలో ఆరోపణలు చేసిన విషయం మరోసారి చర్చకు వచ్చింది.

ప్రస్తుతం తమిళనాడులో మద్యం దుకాణాల మూసివేత అంశం రాజకీయంగా మరియు సామాజికంగా హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది.

Also read: