(Vijay) స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బ్లాక్ సూట్‌లో కనిపించిన విజయ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ స్టైల్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా వైరల్ అవుతోంది.
ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ వస్త్ర బ్రాండ్ TheChennaiSilks ప్రత్యేక మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకొచ్చింది. “CM Vijay Look” పేరుతో ప్రత్యేక దుస్తుల కాంబోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కాంబో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీస్తోంది.
ఈ ప్రత్యేక ప్యాకేజీ ధర రూ.3999గా నిర్ణయించారు. ఇందులో బ్లాక్ బ్లేజర్, ట్రౌజర్, వైట్ షర్ట్, బెల్ట్ మరియు షూస్‌ను కలిపి పూర్తి లుక్‌ను అందిస్తున్నారు. “Complete The Look, Own The Style” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రచారాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు.
విజయ్ (]CM Vijay ) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన స్టైల్ మరియు పబ్లిక్ అప్పియరెన్స్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా సీఎం తరహా లుక్‌లో కనిపించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే లుక్‌ను ఫ్యాషన్ బ్రాండ్లు కూడా ట్రెండ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో “CM Vijay Combo”పై పెద్ద ఎత్తున మీమ్స్, పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొందరు అభిమానులు ఈ లుక్‌ను స్టైలిష్‌గా ప్రశంసిస్తుండగా, మరికొందరు మార్కెటింగ్ ఐడియాపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీతో పాటు ఆయన ఫ్యాషన్ స్టైల్ కూడా ప్రత్యేక చర్చకు కారణమవుతోంది. సినీ హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారుతున్న సమయంలో ఆయన ప్రతి లుక్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పుడు “CM Vijay Look” ట్రెండ్ ఫ్యాషన్ మార్కెటింగ్‌లో కొత్త ఉదాహరణగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read:
- SriLanka: 35 కిలోల చెక్క మంచాన్ని మోస్తూ 8KM రన్నింగ్
- BulletTrain: హైదరాబాద్ నుంచి చెన్నైహైస్పీడ్ రైలు
