Chicken65: చికెన్ 65 వెనుక అసలు కథ ఇదే!

Chicken65

Chicken65

(Chicken 65) పేరు వినగానే చాలా మందికి మసాలా రుచులు గుర్తొస్తాయి. కానీ ఈ స్పైసీ చికెన్ డిష్ వెనుక దాదాపు 60 ఏళ్ల ఆసక్తికరమైన కథ ఉందని చాలా మందికి తెలియదు.

ఈ ప్రసిద్ధ వంటకం మొదటగా Buhari Hotelలో తయారైనట్లు చెబుతారు. చెన్నైలోని ఈ హోటల్‌లో స్పైసీ ఫ్రైడ్ చికెన్ అపెటైజర్‌గా దీన్ని మొదట పరిచయం చేసినట్లు ఆహార చరిత్రకారులు పేర్కొంటున్నారు.

The mystery of chicken 65's name finally explained - Times of India

అయితే “చికెన్ 65” (Chicken65) అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం 1965 సంవత్సరంలో ఈ వంటకం ప్రారంభించడంతో దానికి “చికెన్ 65” అనే పేరు వచ్చిందని చెబుతారు.

మరికొందరు మాత్రం ఈ డిష్ తయారీలో 65 ఎర్రమిర్చీలు వాడేవారని అంటున్నారు. ఇంకొంతమంది కథనం ప్రకారం 65 రోజుల వయస్సు ఉన్న కోడితో ఈ వంటకం చేసేవారట. అందుకే ఆ పేరు వచ్చిందని ప్రచారం ఉంది.

What Is The Origin Story Of 'Chicken 65'? Here's How You Can Make It At  Home! | Curly Tales

Chicken 65 ప్రత్యేకత దాని స్పైసీ టేస్ట్, క్రిస్పీ టెక్స్చర్‌లోనే ఉంది. దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన ఈ వంటకం ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది.

హోటళ్లలో స్టార్టర్‌గా, పార్టీ ఫుడ్‌గా, స్ట్రీట్ ఫుడ్‌గా చికెన్ 65కు ప్రత్యేక క్రేజ్ ఉంది. కాలక్రమేణా దీనికి అనేక వేరియంట్లు కూడా వచ్చాయి. అయితే అసలు రుచి మాత్రం ఇప్పటికీ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది.

Meet The Man Behind Chennai's Chicken 65, The Iconic Starter | Times Now

ప్రస్తుతం చికెన్ 65 చరిత్ర, దాని పేరుపై ఉన్న ఆసక్తికర కథలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఫుడ్ లవర్స్ ఈ డిష్ వెనుక ఉన్న నిజమైన కథ ఏదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Also read: