Shakira:‘డాయ్ డాయ్’తో షకీరా మరోసారి సెన్సేషన్!

Shakira

Shakira

(Shakira) మరోసారి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన మ్యూజిక్‌తో ఊపేస్తోంది. ఒకప్పుడు Waka Waka (This Time for Africa)తో ప్రపంచాన్ని డ్యాన్స్ చేయించిన షకీరా.. ఇప్పుడు కొత్త ఫిఫా వరల్డ్ కప్ యాంథమ్ ‘డాయ్ డాయ్’తో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఫుట్‌బాల్ అభిమానులు, పాప్ మ్యూజిక్ లవర్స్ కోసం ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల థీమ్ డ్రెస్‌లతో షకీరా చేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shakira teases new song for FIFA World Cup 2026; unveils 'Dai Dai' with  Afrobeats star Burna Boy - WATCH | - The Times of India

ఈ వీడియోలో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్లు Lionel Messi, Kylian Mbappé, Erling Haaland ఎనర్జిటిక్ ఎంట్రీలు కూడా ప్రత్యేక హైలైట్‌గా నిలిచాయి. “మేం సిద్ధం” అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ యాంథమ్ అభిమానుల్లో మరింత హైప్ పెంచుతోంది.

(Shakira) పాటకు యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఫిఫా వరల్డ్ కప్ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Shakira & Burna Boy Release Official 2026 FIFA World Cup Anthem 'Dai Dai';  Here's How To Access - Culture

2010 వరల్డ్ కప్ సమయంలో వచ్చిన Waka Waka (This Time for Africa) ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ ‘డాయ్ డాయ్’ కూడా అదే స్థాయిలో గ్లోబల్ యాంథమ్ అవుతుందా అనే చర్చ మొదలైంది.

ఫుట్‌బాల్, మ్యూజిక్, డ్యాన్స్ మిక్స్‌తో రూపొందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. అభిమానులు రీల్స్, షార్ట్ వీడియోలతో పాటను మరింత వైరల్ చేస్తున్నారు.

Also read: