ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన పలు కంటెంట్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లో సందడి చేస్తున్నాయి. అయితే గత వారం ఓటీటీకి వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ చిత్రం (Shabdam) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ భయపెడుతోంది. అదే ‘శబ్ధం’ సినిమా. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించగా, ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

‘శబ్ధం’ (Shabdam) సినిమా ప్రత్యేకత ఏమిటంటే, సాధారణ హారర్ సినిమాల మాదిరిగా కాకుండా ఒక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించబడింది. ముఖ్యంగా ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు గడగడలాడించే అనుభూతిని కలిగిస్తుంది. కథ పరంగా చూస్తే, కేరళలోని ఒక మెడికల్ కాలేజీలో వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం పెద్ద సంచలనంగా మారుతుంది. ఈ మరణాల వెనుక దెయ్యాల ప్రభావం ఉందనే ప్రచారం మొదలవుతుంది. దీంతో కాలేజీ యాజమాన్యం ఒక ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్‌ను ఆహ్వానిస్తుంది.
ఈ కేసును ఛేదించేందుకు వ్యోమ వైద్యలింగం అనే ఇన్వెస్టిగేటర్ రంగంలోకి దిగుతాడు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతుంటాయి. ఇదే సమయంలో కాలేజీలో పని చేసే లెక్చరర్ అవంతిక ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా మారుతుంది. డయానా, నాన్సీ అనే పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో కాలేజీ లైబ్రరీలో దాగి ఉన్న రహస్యాలు, 42 దెయ్యాల కథ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి.
ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించగా, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో రెడిన్ కింగ్ స్లే, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మేనర్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అరివళగన్ ఈ సినిమాను ప్రత్యేకమైన హారర్ అనుభూతిని కలిగించేలా తెరకెక్కించారు. గతంలో ‘వైశాలి’ వంటి హిట్ ఇచ్చిన ఆయన ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇటీవలే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో విడుదలైంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు వెర్షన్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. హారర్ సినిమాలు ఇష్టపడే వారికి ‘శబ్ధం’ ఒక తప్పక చూడాల్సిన మూవీగా నిలుస్తోంది.
Also read:
