సొంత కారు (Car) కొనుగోలు చేయడం ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఒకప్పుడు కారు అంటే ధనికులకే పరిమితమైన విలాస వస్తువుగా భావించేవారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్‌తో పాటు మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్లు, భద్రతా ప్రమాణాలతో కూడిన కార్లు అందుబాటులోకి రావడంతో మధ్యతరగతి కుటుంబాల కారు కల సాకారమవుతోంది.
![]()
బడ్జెట్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న కార్లలో టాటా పంచ్ ఒకటి. మైక్రో ఎస్‌యూవీ Tata Punch One. Micro SUV విభాగంలో మంచి గుర్తింపు పొందిన ఈ కారు బలమైన నిర్మాణం, అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో ప్రత్యేకతను చాటుకుంటోంది. నగర రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. భద్రత విషయంలో 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

అలాగే Hyundai Grand i10 Nios హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే కారుగా గుర్తింపు పొందింది. వైర్‌లెస్ ఛార్జింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనుక ఏసీ వెంట్స్ వంటి సదుపాయాలతో ఈ కారు కుటుంబ వినియోగానికి అనువుగా నిలుస్తోంది. సీఎన్‌జీ వేరియంట్‌లో మంచి మైలేజ్ అందించడం దీని మరో ప్రత్యేకత.
యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన (Car) కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ Maruti Suzuki Swift ముందుంటుంది. స్పోర్టీ డిజైన్, సులభమైన డ్రైవింగ్ అనుభవం, ఆధునిక కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అంశాలు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ముఖ్యంగా సీఎన్‌జీ వేరియంట్‌లో లభించే అధిక మైలేజ్ కారణంగా ఇది ఖర్చు తగ్గించే ఎంపికగా నిలుస్తోంది.

తక్కువ ధరలో ఎస్‌యూవీ లుక్ కోరుకునే వారికి నిస్సాన్ మాగ్నైట్ మంచి ప్రత్యామ్నాయంగా మారింది. విశాలమైన క్యాబిన్, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్‌స్క్రీన్, ఆధునిక భద్రతా ఫీచర్లతో ఈ కారు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది. నగర ప్రాంతాల్లో పార్కింగ్, ట్రాఫిక్ పరిస్థితుల్లో సులభంగా నడిపేలా డిజైన్ చేయబడింది.

కారు కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కేవలం ధర మాత్రమే కాకుండా మైలేజ్, భద్రత, నిర్వహణ ఖర్చులు, సర్వీస్ నెట్‌వర్క్, భవిష్యత్తు రీసేల్ విలువ వంటి అంశాలను కూడా పరిశీలించాలని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఎంపికతో కుటుంబ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌లోనే మంచి కారు సొంతం చేసుకోవచ్చు.
Also read:
