(Nizamabad) నిజామాబాద్, ఆగస్టు 2: అప్పటి ఇందూర్ (ప్రస్తుతం నిజామాబాద్) ప్రభుత్వ ఐటీఐ ఆర్సపల్లిలో డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) కోర్సు 1993–1995 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిజామాబాద్ నగరంలో ఉత్సాహంగా జరిగింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్నేహితుల దినోత్సవం రోజు ఈ కార్యక్రమ నిర్వహణ ప్రత్యేకంగా నిలిచింది.
కుటుంబ సభ్యుల యోగక్షేమాలను పరస్పరం తెలుసుకుంటూ పాత అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనానికి అప్పట్లో బోధించిన గురువు అశోక్ కుమార్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన అందించిన ఆశీస్సులు, ప్రోత్సాహకరమైన సందేశాలు (Nizamabad) పూర్వ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. గురువు–శిష్యుల అనుబంధానికి ఈ కార్యక్రమం నిదర్శనంగా నిలిచింది.
ఈ సమ్మేళనంలో జే. అంజనేయులు, రాజు, నరోత్తమ్, నందకిషోర్ పవార్, హరిప్రసాద్ అక్కల్దేవి, సంతోష్ కుమార్, డొండి మధు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆత్మీయ కలయికలను కొనసాగించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. కాలం మారినా స్నేహబంధాలు, విద్యార్థి దశ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు.
Also read:
